వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి ఇంచార్జీగా మొయిలీ ఔట్, ఆజాద్ ఇన్: సిడబ్ల్యుసిలోకి రాహుల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad-Veerappa Moily
న్యూఢిల్లీ: పార్టీ అత్యున్నత నిర్ణాయక సంస్థ కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్య్లూసి)ని శుక్రవారం పునర్వ్యస్థీకరించారు. కాగా, పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీని మార్చారు. వీరప్ప మొయిలీని తొలగించి ఆయన స్థానంలో గులాం నబీ ఆజాద్‌ను వేశారు. 2004 శాసనసభ ఎన్నికల సమయంలో గులాం నబీ ఆజాద్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాలపై ఆయనకు మంచి అవగాహన ఉంది. అలాగే పార్టీ నాయకులతోనూ మంచి సంబంధాలున్నాయి. ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నేతగా ఎన్నుకునే సమయంలో ప్రత్యేకంగా గులాం నబీ ఆజాద్‌ను హైదరాబాద్ పంపించారు.

కాగా, సిడబ్ల్యుసిలో రాష్ట్రానికి మొండిచేయే ఎదురైంది. ప్రాంతీయ ఉద్యమాల నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ఎవరిని కూడా సిడబ్ల్యుసిలోకి తీసుకోలేదు. సంజీవరెడ్డి మాత్రం ప్రత్యేక ఆహ్వానితుడిగా కొనసాగుతారు. జి. వెంకటస్వామికి, కె. కేశవరావుకు చోటు దక్కలేదు. పశ్చిమ బెంగాల్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా కేశవరావును తొలగించారు. కిశోర్ చంద్రదేవ్, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలకు కూడా చోటు దక్కలేదు. వి. హనుమంతరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి మాత్రం ఎఐసిసి కార్యదర్సులుగా కొనసాగుతారు. గులాం నబీ ఆజాద్‌కు సహాయకులుగా కెబి కృష్ణమూర్తి, శాంతారాం నాయక్ వ్యవహరిస్తారు.

రాహుల్ గాంధీని సిడబ్ల్యుసిలోకి తీసుకున్నారు. ఆయన యూత్ కాంగ్రెసు, ఎన్‌ఎస్‌యుఐ బాధ్యతలు చూస్తారు. సోనియా రాజకీయ సలహాదారుగా అహ్మద్ పటేల్ కొనసాగుతారు. సిడబ్ల్యుసిలో సోనియా, మన్మోహన్ సింగ్‌లతో పాటు పి. చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్, మోతీలాల్ ఓరా, ముఖుల్ వాస్నిక్ కొనసాగుతారు.

English summary
Ghulam Nabi Azad replaced Veerappa Moily as Andhra Pradesh affairs in charge. Rahul gandhi inducted into CWC as the in charge of Youth Congress and NSUI. AP leaders were ignored in inducting into CWC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X