హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీల అభిప్రాయాల తర్వాత తెలంగాణపై నిర్ణయం: కిరణ్ కుమార్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ నివేదికపై రాష్ట్రానికి చెందిన ఎనిమిది రాజకీయ పార్టీలు అభిప్రాయం చెప్పిన తర్వాత తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణపై చర్చించాలంటూ బిజెపి, సిపిఐ సభ్యులు శుక్రవారం శాసనసభలో వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. ఆ వాయిదా తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. అయినా ప్రతిపక్ష సభ్యులు వినలేదు. దీంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వివరణ ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి కొన్ని పార్టీలు హాజరు కాలేదని, నివేదికను అధ్యయనం చేసిన తర్వాత కేంద్రం మళ్లీ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తుందని, అఖిల పక్ష సమావేశంలో పార్టీ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు. సభ జరగడానికి సహకరించాలని ఆయన కోరారు.

ముఖ్యమంత్రి వివరణతో బిజెపి, సిపిఐ సభ్యులు సంతృప్తి చెందలేదు. చర్చకు పట్టుబట్టారు. తెలుగుదేశం సభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు కాంగ్రెసుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చిచ్చు పెట్టింది కాంగ్రెసు పార్టీయేనని, పరిష్కరించాల్సింది కూడా ఆ పార్టీయేనని ఆయన అన్నారు. సోనియా గాంధీ గానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ తెలంగాణపై తమ తమ వైఖరులను ఎందుకు చెప్పడం లేదని ఆయన అడిగారు. తెలుగుదేశం సభ్యుల తీరుపై ప్రభుత్వ చీఫ్ విప్ మల్లుభట్టి విక్రమార్క విరుచుకుపడ్డారు. చంద్రబాబు సభలో కూర్చోలేని పరిస్థితిని తెలుగుదేశం సభ్యులు కల్పిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సభలో సరిగా వ్యవహరించాలని నాదెండ్ల మనోహర్ చెప్పినా సిపిఐ, బిజెపి సభ్యులు వినలేదు. దీంతో సభను ఆయన వాయిదా వేశారు.

English summary
Chief Minister N Kiran Kumar Reddy said that Centre will take decision on Srikrishna Committee report after consulting 8 political parties belong to Andhra Pradesh. He said that all political parties should express opinion on Srikrishna committe report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X