హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం ఆఫీసు ముందు జీతాల కోసం సీమాంధ్ర ఉద్యోగుల ధర్నా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తమకు జీతాలు వెంటనే చెల్లించాలంటూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు శుక్రవారం సచివాలయంలోని సి బ్లాక్‌లో గల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. నెల గడిచి ఐదు రోజులు అయినప్పటికీ జీతాలు రాకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ ఒకటో తారీఖున వచ్చే జీతాలు ఇప్పటి వరకు రాకపోవడంతో సమస్యలు చుట్టు ముడుతున్నాయని అన్నారు. తమ ఫిబ్రవరి నెల జీతాలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణ వల్ల జీతాలు ఆగిపోతే ఎవరైతే పని చేయలేదో వారికి జీతాలు ఇవ్వకూడదని అన్నారు. పని చేసిన మాకు జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎవరు పని లేదో ప్రభుత్వానికి తేల్చుకోవడానికి పెద్ద పనేమీ కాదన్నారు. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఉద్యోగ జెఏసితో సమావేశమయ్యారని, ఆయన తన నిర్ణయాన్ని ఆ తర్వాత ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యోగ సమస్యలపై ఏం నిర్ణయం తీసుకున్నప్పటికీ తమ జీతాలు మాత్రం ఆపకూడదని అన్నారు. గతంలో జీతాల కోసం ధర్నాలు చేసే పరిస్థితి ఎప్పుడూ రాలేదన్నారు.

English summary
Seemandhra employees organiged dharna at CM chamber in Secretariat. They demanded for salaries. They blamed government for salaries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X