వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంజినీరింగ్ విద్యార్థిని కృష్ణవేణి హత్య కేసు: రవికుమార్ అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్టణం: ఇంజినీరింగ్ విద్యార్థిని అయిన తన భార్యను కిరాతకంగా హత్య చేసిన రవికుమార్‌ను విశాఖపట్టణం పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. నగరంలో ఇలాంటి దారుణ సంఘటన గతంలో ఎన్నడూ జరగకపోవడంతో ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నాలుగు ప్రత్యేక బృందాలను వివిధ ప్రాంతాలకు పంపించి ఈస్ట్ ఏసీపీ ఎంకెఎం నాయుడు ఆధ్వర్యంలో సెల్‌టవర్ లొకేషన్ ఆధారంగా రవికుమార్ ఆచూకీని కనిపెట్టారు. విజయనగరం ప్రాంతంలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ తిరుమలరావు ఆధ్వర్యంలో సిబ్బందిని అక్కడికి పంపించారు.

స్నేహితుడి గదిలో తలదాచుకున్న రవికుమార్‌ను అదుపులోకి తీసుకుని శనివారం రాత్రి నగరానికి రప్పించారని సమాచారం. వివిధ కోణాల్లో విచారించిన అనంతరం రవికుమార్‌ను ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విశాఖలోని శివాజీపాలేనికి చెందిన కృష్ణవేణి అనే వివాహిత విద్యార్థినిని ఆమె భర్త రవికుమార్ శుక్రవారం సాయంత్రం నడిరోడ్డుపై కత్తితో గొంతు కోసిన విషయం తెలిసిందే. కాగా కృష్ణవేణి అంత్యక్రియలు విషాదఛాయల్లో ముగిసాయి. ఆమె మృతదేహానికి త్రీటౌన్ పోలీసులు శనివారం పోస్టుమార్టం జరిపించిన అనంతరం ఆమె బంధువులకు అప్పగించారు.

English summary
Main accused Ravikumar in Engineering student Krishnaveni murder case was arrested police on sunday. Ravikumar is 
 
 husband of victim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X