వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్ సునామీ మృతులు 19 మంది, అంతా నేలమట్టం

By Pratap
|
Google Oneindia TeluguNews

Japan Tsunami
టోక్యో: భూకంపం వల్ల 19 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. భూకంపం తర్వాత జపాన్ తీరాన్ని సునామీ తాకింది. సునామీ తాకిన ప్రాంతంలో ఇల్లు,కార్లు, ఫామ్ భవనాలు తుడిచిపెట్టుకుపోయాయి. గోడ కూలడంతో ఓ 67 ఏళ్ల వ్యక్తి, పైకప్పు కూలడంతో ఓ మహిళ మరణించారు.వీరిద్దరు కూడా టోక్యోలో మరణించారు. మరో ముగ్గురు వారి ఇళ్లు కూలడంతో మృతి చెందారు. అయితే మృతుల సంఖ్యను జాతీయ పోలీసు ఏజెన్సీ నిర్ధారించలేకపోతోంది.

నష్టం అంతు లేకుండా జరిగిందని, వివరాలు సేకరించడం ఇంత త్వరగా సాధ్యం కదాని ఏజెన్సీ అధికారులు చెబుతున్నారుూ. పుకుషిమా పర్ఫెక్చర్‌లో నాలుగు మిలియన్ల ఇళ్లు విద్యుత్ లేక అంధకారంలో చిక్కుకున్నాయి. పిలిప్పైన్స్, తైవాన్, ఇండోనేషియాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం కొలంబియా, పెరూలకు సూచించింది. భూకంపం తర్వాత కూడా టోక్యోలో పలు ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు బీతిల్లి వీధుల్లోకి వచ్చారు. ప్రజలు గజగజ వణికిపోయారు.

English summary
The biggest earthquake to hit Japan in 140 years struck the northeast coast on Friday, triggering a 10-meter tsunami that swept away everything in its path, including houses, cars and farm buildings on fire, media and witnesses said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X