హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విధ్వంసకారులపై కఠిన చర్యలు, ఎంతటి వారైనా ఉపేక్షించం: సిఎం కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: మిలియన్ మార్చ్ సందర్భంగా పలువురు ఆందోళనకారులు తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటిన ప్రముఖుల విగ్రహాలను ధ్వంసం చేయడం విచారకరమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం అన్నారు. ప్రముఖుల విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మిలియన్ మార్చ్‌కు అనుమతి నిరాకరించడంతో ఐక్య కార్యాచరణ సమితి నేతలు తనను కలిశారని చెప్పారు. మార్చ్‌ను శాంతియుతంగా చేసుకుంటామని హామీ ఇచ్చారని, ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే బాధ్యత తమదే అని చెప్పారన్నారు.

కానీ విగ్రహాలు ధ్వంసం చేయడం సరికాదన్నారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. విధ్వంసానికి పాల్పడ్డ వారందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉద్యమ నేతలకు హింసాత్మక సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత చాలా ఉందన్నారు. టాంక్‌బండ్‌పై కూల్చిన విగ్రహాల స్థానంలో మళ్లీ నిర్మిస్తామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, మీడియాపై దాడిని కూడా ఆయన ఖండించారు. విగ్రహాల విధ్వంసం వల్ల తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదని అన్నారు.

English summary
CM Kiran Kumar Reddy said today that government will take action on accuses, who were destroyed statues on tankbund.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X