హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి సీమాంధ్ర శాసనసభ్యులకు నాగం జనార్దన్ రెడ్డి కౌంటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శుక్రవారం శాసనసభలో ఒకే సమయంలో భిన్న వైఖరులను ప్రదర్శించారు. విగ్రహాల విధ్వంసపై టీడీపీ సీమాంధ్ర శాసనసభ్యులు పట్టుపడుతుండగా, తెలంగాణ నేత నాగం నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల అరెస్టులపై చర్చించాలంటూ నిరసన గళం వినిపించారు. దీంతో తెలుగుదేశం శాసనసభ్యులు చాలా మంది గందరగోళంలో పడ్డారు. నాగంను బుజ్జగించే ప్రయత్నం చేశారు.

మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై జరిగిన విధ్వంసాన్ని అసెంబ్లీలో చర్చించాలంటూ సీమాంధ్ర టీడీపీ ఎమ్యెల్యేలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేయడాన్ని టీడీపీ ఎమ్యెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో టీడీపీకి ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. నాగంను బుజ్జగించేందుకు టీడీపీ ఎమ్యెల్యేలు తంటాలు పడుతున్నారు. మిలియన్ మార్చ్ సందర్భంగా లక్షమందిని అరెస్ట్ చేసిన విషయంపై చర్చించకుండా విగ్రహాల విధ్వంసంపై చర్చించడం సరికాదని నాగం అభిప్రాయపడ్డారు.

కాగా, తెలంగాణ అంశంపై బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే ప్రతిపాదించాలని వారు డిమాండ్ చేశారు. సీమాంధ్ర శాసనసభ్యులకు నాగం జనార్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో వారు ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

English summary
TDP Telangana region MLA Nagam janardhan Reddy opposed his party Seemandhra MLAs stand. Nagam Janardhan reddy demanded for debate on telanganites arrests, while party Seemandhra MLAs stalled the assembly proceeding on attack Tank bund statues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X