19 దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ, ముందు జాగ్రత్త చర్యలు
International
oi-Pratapreddy
By Pratap
|
హొనోలులు: జపాన్ భూకంపంతో పలు దేశాలకు సునామీ ప్రమాదం పొంచి ఉంది. పసిఫిక్ తీర ప్రాంతంలోని పలు దేశాలను సునామీ తాకే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. సునామీ ప్రమాదం పొంచి ఉందనే వార్తలతో హవాయ్ తీర ప్రాంతంలోని ప్రజలను ఖాళీ చేయించారు. హవాయ్‌లోని ఆసియా పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం మరిన్ని దేశాలను అప్రమత్తం చేసింది. హవాయ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మధ్య, దక్షిణ అమెరికా దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది.
అమరికా రాష్ట్రాలకు, కెనడాలకు తక్కువ స్థాయి సునామీ హెచ్చరికలను జారీ చేసింది. సునామీ తొలుత హవాయ్‌ని, ఆ తర్వాత అమెరికా పశ్చిమ తీరాన్ని తాకుతుందని ఆ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. జపాన్ భూకంపంతో ప్రజలు భయకంపితులవుతున్నారు. సునామీ తాకిన జపాన్ ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయాయి. భీతావహమైన వాతావరణం చోటు చేసుకుంది.
US tsunami monitoring center on Friday widened a warning to virtually the entire Pacific coast, including Australia
and South America, after a massive earthquake in Japan.
Story first published: Friday, March 11, 2011, 17:33 [IST]