హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్యాంక్‌బండ్ విగ్రహాల విధ్వంసంపై కెసిఆర్, కోదండరామ్‌లపై కేసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై గురువారం జరిగిన సంఘటనలకు బాధ్యులుగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖరరావు, శాసనసభ్యులు హరీష్‌రావు, కెటి రామారావు, తెలంగాణ రాజకీయ జెఎసి ఛైర్మన్‌ కోదండరాంలపై గాంధీనగర్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. విధ్వంస ప్రేరేపణ, హత్యాయత్నం సెక్షన్లు నమోదు చేశారు.

ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను ధ్వంసం చేసిన 56 మందిని అరెస్టు చేశారు. మరికొందరు అనుమానితుల కోసం గాలిస్తున్నారు. మీడియా ప్రతినిధులపై దాడి, కెమెరాల ధ్వంసం, ఈటీవీ ప్రత్యక్ష ప్రసార వాహనానికి నిప్పు పెట్టిన సంఘటనలపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని మధ్య మండలం డీసీపీ డాక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై జరిగిన విధ్వంసం, అనంతర పరిణామాలపై మొత్తం 16 కేసులు నమోదు చేశామని వివరించారు.

విగ్రహాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన వారిలో కొందరిని, ధ్వంసం చేస్తున్నప్పుడు రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు చేసిన వారిలో కొందరిని ఇలా 48 మందిని సంఘటన జరిగిన వెంటనే గురువారమే అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మరో 8 మందిని పట్టుకున్నారు. మొత్తం 56 మందిని అరెస్టు చేశారు. వీరంతా 25-35 ఏళ్లలోపు వారేనని గుర్తించారు. వీరిలో తెరాస నాయకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, నలుగురు న్యాయవాదులు, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. వీరిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

English summary
Cases booked against TRS president K Chandrasekhar Ra, political JAC chairman Kodandaram and MLAs Harish Rao, KT Ramarao in Tank bund statues attack. 56 more telanganites are also arrested in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X