వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జపాన్ న్యూక్లియర్ ప్లాంట్లో విస్పోటనం, పొంచి ఉన్న అను ప్రమాదం

ప్లాంట్ విస్పోటనంతో వెలువడిన అణు ధార్మికతకు నలుగురు ప్రమాదానికి గురయ్యారు. ప్లాంట్ పది కిలోమీటర్ల పరిధిలో 45 వేల మంది నివసిస్తున్నారని, వారందరినీ ఖాళీ చేయస్తున్నామని జపాన్ అధికారులు చెప్పారు. ప్రధాని నోవాటో కాన్ సంఘటనా స్థలాన్ని శనివారం ఉదయం హెలికాప్టర్ ద్వారా సందర్శించారు. భారీ విస్పోటనం కారణంగా ప్రధాన భవంతి, ప్రహరీగోడలు పేలిపోయాయి. ప్రధానమైన ప్లాంట్ భూకంపానికి ధ్వంసం కావడంతో కూలింగ్ వాటర్ స్థాయిలు పెద్ద యెత్తున పడిపోయి ఈ ప్రమాదం సంభవించింది. రియాక్టర్ కరిగిపోవడంతో కూలింగ్ వాటర్ నష్టం వాటిల్లింది. ప్రజలు తమ శరీరం అణు ధార్మికతకు గురి కాకుండా చూసుకుంటూ ముఖాలకు మాస్క్లు, తడి తువ్వాళ్లు కప్పుకున్నారు.