జపాన్ సునామీ మృతులు 1300 మందికి పైగానే, తీవ్ర నష్టం
International
oi-Pratapreddy
By Pratap
|
టోక్యో: జపాన్ సునామీకి 1300 మందికి పైగా బలయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మంటలు లేస్తున్నాయి. భూకంపం, సునామీ తర్వాత జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీరు ప్రవహిస్తోంది. సునామీ, భూకంపాల వల్ల జపాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. శవాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. ప్రజలు సహాయం కోసం అంగలారుస్తున్నారు. తిండి కావాలంటూ, సహాయం చేయండంటూ దీనంగా వేడుకుంటున్నారు. టోక్యోలో సబ్ వేలను మూసేశారు. ఇళ్లు కోల్పోయినవారు రోడ్ల మీదనే జీవితాలను వెళ్లదీస్తున్నారు. బ్రీఫ్ కేసులను దిండ్లుగా చేసుకుని వార్తాపత్రికలు వేసుకుని పడుకున్నారు.
భూకంపం వల్ల అణు రియాక్టర్ కూలింగ్ వ్యవస్థపై ప్రభావం పడడంతో రేడియేషన్ ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ప్లాంట్ చుట్టుపక్కల ఉన్నవారిని ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రధాని నావోటా కాన్ ఆదేశించారు. ఫుకుషమా ప్లాంట్ ప్రమాదం ప్రజలపై పడకుండా తగిన చర్యల కోసం జపాన్ అమెరికా సహాయం కోరింది. భూకంప బాధితులను ఆదుకోవడానికి సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. జపాన్‌కు అవసరమైన సహాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు.
Japan confronted devastation along its northeastern coast on Saturday, with fires raging and parts of some cities under water after a massive earthquake and tsunami that likely killed at least 1,300 people.
Story first published: Saturday, March 12, 2011, 11:44 [IST]