కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ కాంగ్రెసు జెండా ఆవిష్కరణ, జగన్ పార్టీ ఆవిర్భావం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vijayalakshmi
కడప: చాలా కాలంగా ఎదురు చూస్తున్న మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పార్టీ ఆవిర్భావంతో జరిగింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పతాకను జగన్ తల్లి, వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయలక్ష్మి శనివారం ఆవిష్కరించారు. కడప జిల్లా పులివెందులలోని వైయస్సార్ ఘాట్ వద్ద ఆమె పార్టీ పతాకను ఆవిష్కరించారు. జెండాలో నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులున్నాయి. మధ్యలో ఉన్న తెలుపు రంగుపై వైయస్ రాజశేఖర రెడ్డి ఛాయాచిత్రం ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించినట్లయింది.

జెండాలోని నీలం యువత చైతన్యానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ వ్యవసాయానికి ప్రతీకలు. వైయస్సార్ చిత్రపటం చుట్టూ వైయస్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలను చేర్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడంతో తన తల్లితో కలిసి తాను ఒక కుటుంబ కార్యక్రమంగానే జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసుకుంటానని వైయస్ జగన్ అంతకు ముందు ఎన్నికల సంఘానికి తెలియజేశారు. అయితే, ఈ కార్యక్రమానికి పెద్ద యెత్తున ప్రజలు తరలి వచ్చారు. శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
YSR wife YS Vijayalaxmi hoisted YS Jagan's YSR Congress party's flag today at YSR ghat at Pulivendula of Kadapa district. With this YS Jagan YSR Congress party came into Andhra pradesh political scene.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X