హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంస్కృతిపై దాడి కాదు ఆవేశంతో చేసినది: గాయకుడు దేశపతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Desapathi Srinivas
హైదరాబాద్: సాహితీ లోకం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్ ఆదివారం ఓ టీవీ కార్యక్రమంలో అన్నారు. సాహితీలోకంలో తెలంగాణ సంస్కృతి ఎందుకు భాగం కాలేదని ప్రశ్నించారు. తెలంగాణ గుండెచప్పుడును సాహిత్యం ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. ప్రతి అంశం రాజకీయంతో ముడి పడి ఉంటుందని చెప్పారు. విగ్రహాలు వేరు రాజకీయం వేరు కాదన్నారు. నామ మాత్రంగానే తెలంగాణ వైతాళికుల విగ్రహాల స్థాపన జరిగిందన్నారు. కడప కోటిరెడ్డికి హైదరాబాద్‌కు సంబంధం ఏమిటని దేశపతి ప్రశ్నించారు. కార్మిక నేత రావి నారాయణరెడ్డి విగ్రహం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు తెలంగాణను విస్మరిస్తున్నారన్నారు. విగ్రహాల కూల్చివేత ఆవేశంలో చేసిందే తప్ప సంస్కృతిపై దాడి కాదన్నారు.

ఆధిపత్య భావంతోనే సీమాంధ్రులు తెలంగాణ సంస్కృతిని అణిచి వేశారన్నారు. తెలంగాణ కోసం 600 మంది విద్యార్థులు చనిపోతే సాహితీ లోకం ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ గుండె చప్పుడును సాహితీ లోకం ఏనాడు పట్టించుకోలేదన్నారు. విగ్రహాల వెనుక ఉన్న రాజకీయం చూడాలని ఆయన సూచించారు. మనుషుల్ని విడదీసి మూలాలు చూడాలని కోరారు. కాగా విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని గరికపాటి ప్రశ్నించారు. కవులు విశ్వ మానవతా సందేహాన్ని ఇవ్వాలన్నారు. ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని అన్నారు.

English summary
Singer Desapathi Srinivas said that there is no defferencec between politics and literature. He accused that literature 
 
 also neglected Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X