హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను, టిఆర్ఎస్‌ను అణిచి వేయడానికి కుట్ర: గోనె ప్రకాశరావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao
హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, తెలంగాణ రాష్ట్ర సమితిని అణిచి వేయడానికి కుట్ర చేస్తోందని జగన్ వర్గం నేత గోనె ప్రకాశ్‌రావు ఆదివారం ఆరోపించారు. అయితే జగన్‌కు ప్రజాధరణ ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై పార్టీ పరంగా ప్రకటన చేయించే బాధ్యత కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె కేశవరావు, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిలపైనే ఉన్నదన్నారు.

రాష్ట్రంలో పాలక పక్షం, ప్రతిపక్షం అంటూ ఏమీ లేవన్నారు. రెండూ ఒకటే అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదన్నారు. కాగా జగన్ సొంత పార్టీ పెట్టడాన్ని రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు హర్షిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత బాజిరెడ్డి గోవర్థన్ తిరుపతిలో అన్నారు. 2004 ముందు పతనస్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తన పాదయాత్రతో వైఎస్ నిలబెట్టారని చెప్పారు. టీడీపీ అమ్మకానికి సిద్ధంగా ఉందన్నారు.

English summary
Ex MP YS Jagan camp senior leader Gone Prakash Rao said that there is no ruling and opposition in state. He 
 
 accused that government is trying to destroy YS Jagan's party and TRS party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X