వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్‌లో పదివేల మంది గల్లంతు: అణు రియాక్టర్‌ల ప్రమాదం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Japan Tsunami
టోక్యో: జపాన్‌లో భూకంపం, సునామీ వల్ల జపాన్‌లో ఆదివారం రెండో అణు రియాక్టర్ పేలింది. మరోవైపు సునామీ, భూకంపం కారణంగా మినామీ నగరంలో సుమారు సగం మంది గల్లంతయినట్లుగా తెలుస్తోంది. సుమారు 10వేల మంది ప్రజలు గల్లంతయినట్లు స్థానిక పోలీసు అధికారి ఒకరు చెప్పినట్లుగా తెలుస్తోంది. సునామీ, భూకంపం కారణంగా జపాన్‌లోని ఓ దీవి 8 అడుగుల దూరం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే శనివారం ఫకుషీమాలోని అణు రియాక్టర్ పేలడంతో వేలాది మంది ప్రజలు గల్లంతయ్యారు. ఈ ప్రాంతం జపాన్ రాజధాని టోక్యోకు 240 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కాగా ఈ రెండు అణు ప్లాంట్లు పేలినట్లుగా మూడోది పేలకుండా ఉండటానికి మూడో అణు ప్లాంట్‌ శీతలీకరణకోసం సముద్రం నీటిని పంపింగ్ చేస్తున్నారు. మూడో అణు రియాక్టర్ కూడా కరిగి పోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. కాగా ఇలా చేస్తే ఛెర్నోబిల్‌లాంటి ప్రమాదం ఎదురయ్యే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరిస్తోంది. కాగా మొత్తం 56 అణువిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. జపాన్‌లో విద్యుత్ అంతా అణు రియాక్టర్ల ద్వారానే జరుగుతోంది.

English summary
The death toll from Japan's devastating earthquake and tsunami is likely to exceed 10,000 in Miyagi prefecture alone, a regional police chief told reporters on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X