• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దంతెవాడలో ఎన్‌కౌంటర్, 25 మంది మావోయిస్టుల మృతి?

By Pratap
|

Maoists Encounter
దంతెవాడ‌: ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కనీసం 25 మంది మావోయిస్టులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, మావోయిస్టు మృతుల సంఖ్య పది మాత్రమే ఉండవచ్చునని కూడా అంటున్నారు. అయితే, మావోయిస్టులు ఎంత మంది చనిపోయారనే విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. అయితే, ముగ్గురు స్పెషల్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు (ఎస్‌పివోలు) మాత్రం మరణించినట్లు చెబుతున్నారు. ఒక జవాను గాయపడ్డాడు. ఎన్‌కౌంటర్ దంతెవాడ జిల్లా చింతలనార్‌లోని మోడుపల్లి అడవుల్లో జరిగింది.

పోలీసులకు, మావోయిస్టులకు మధ్య సోమవారం మధ్యాహ్నం ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. సాయంత్రం వరకు ఇవి కొనసాగాయి. చీకటి పడడంతో భద్రతా బలగాలు వెనక్కి వచ్చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 70 మందితో కూడిన భద్రతా బలగాలు ఎదురుకాల్పుల్లో పాల్గొన్నట్లు సమాచారం. వారు గాలింపు చర్యలు చేపట్టినప్పుడు దాదాపు 50 మంది మావోయిస్టులు తారసపడ్డారని, భద్రతా బలగాలను చూడగానే వారు కాల్పులు ప్రారంభించారని, ప్రతిగా భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయని అంటున్నారు.

మావోయిస్టులు ఎంత మంది మరణించారనే విషయంపై రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. టీవీ చానెళ్లలో ఈ సంఖ్య పలు రకాలుగా వస్తోంది. మరణించిన మావోయిస్టులు 25 మంది ఉంటారని, 11 మంది మాత్రమే ఉన్నారని, పది మాత్రమే మరణించారని వార్తలు వస్తున్నాయి. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఎవరైనా ఉన్నారా అనే విషయం తేలడం లేదు.

English summary
It is said that 25 Maoists were killed in an encounter with police in dantewada district of Cchattisgarh. Three SPOs were killed in encounter. Encounter began at monday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X