వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్ సునామీ ప్రభావం, న్యూక్లియర్ ప్లాంట్‌లో తాజా పేలుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Japan Nuclear Plant
టోక్యో‌: సునామీ ప్రభావంతో జపాన్‌లో అణు సంక్షోభం నెలకొంది. సోమవారం ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలోని మూడో రియాక్టర్‌లో పేలుడు చోటు చేసుకుంది. ఈ రియాక్టర్‌లో శీతలీకరణ వ్యవస్థ విఫలం కావడంతో ఈ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. పేలుడు తర్వాత గాలిలో దట్టమైన పొగ వెలువడుతోంది. దీంతో జపాన్ ప్రభుత్వం దేశంలో న్యూక్లియర్ ఎమర్జన్సీ ప్రకటించింది.

భూకంపం, సునామీలతో అతలాకుతలమైన జపాన్‌కు అణు ముప్పు పొంచి ఉందని అణు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫుకుషిమా నగరంలోని అణువిద్యుత్కేంద్రంలో మరో రియాక్టర్ ప్రమాదంలో చిక్కుకుంది. మూడో రియాక్టర్ పేలుడు చోటు చేసుకోవడం దీనికి సంకేతంగా చెపుతున్నారు. ఈ ప్లాంటులో మరిన్ని పేలుళ్లు సంభవించే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కేంద్రంలో గత శనివారం మొదటి రియాక్టర్ పేలగా, ఆదివారం రెండో రియాక్టర్‌లో పేలుడు చోటు చేసుకుంది.

కాగా, జపాన్ రాజధాని టోక్యోలో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.8గా నమోదైంది. భూకంపం వల్ల భవనాలు స్వల్పంగా కంపించాయి. అయితే అధికారులు మాత్రం సునామీ ప్రమాదం లేదని వెల్లడించారు.

English summary
A new explosion rocked Japan's Fukushima Daiichi nuclear power complex on Monday, sending a plume of smoke into the air. Japanese authorities have been working desperately to avert a meltdown, compounding a nuclear catastrophe caused by Friday's massive quake and tsunami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X