హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ రచయితల విగ్రహాలు ప్రతిష్టించాల్సిందే: కల్వకుంట్ల కవిత

By Pratap
|
Google Oneindia TeluguNews

Kalwakuntla Kavitha
హైదరాబాద్: మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ధ్వంసమైన విగ్రహాలను తిరిగి నెలకొల్పితే తెలంగాణ కవులు, రచయితల విగ్రాహాలను కూడా స్థాపించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. విగ్రహాల విధ్వంసంపై సీమాంధ్ర మేధావుల విమర్శలను నిరసిస్తూ తెలంగాణ కవులు, రచయితలు సోమవారం ఉదయం ప్రదర్శన నిర్వహించారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సీమాంధ్ర ప్రభుత్వం ఎక్కువగా సీమాంధ్ర కవులు, రచయితల విగ్రహాలనే స్థాపించిందని, విగ్రహాల ప్రతిష్టాపనలో ప్రభుత్వం వివక్ష ప్రదర్సించిందని ఆమె ఈ సందర్భంగా విమర్శించారు.

ఇప్పటికై తెలంగాణ కవులు, రచయితల విగ్రహాలు స్థాపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికై తెలంగాణ మేధో సంపత్తిని గుర్తించాలని ఆమె అన్నారు. సీమాంధ్ర కవులు, రచయితల విగ్రహాలు తెలంగాణలో స్థాపించారని, సీమాంధ్రలో మాత్రం తెలంగాణ కవులు, రచయితల విగ్రహాలు లేవని ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఇది ప్రభుత్వ వివక్ష అని ఆయన అభిప్రాయపడ్డారు. స్వాభిమాన్ యాత్ర పేర జరిగిన ఈ ప్రదర్శనలో తెలంగాణకు చెందిన కవులు, రచయితలు పాల్గొన్నారు.

English summary
Telangana Jagruthi president Kalwakuntla Kavitha demanded install Telangana poets and writers statues on tank bund in Hyderabad. She criticised that Seemandhra government shown partiality in installing statues on tank bund.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X