వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్ర నాయకులు వెకిలి మాటలు మాట్లాడుతున్నారు: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
నల్లగొండ‌: సీమాంధ్ర నాయకులు జరిగిన సంఘటనలను గోరంతలు కొండంతలు చేస్తూ తెలంగాణవారిని తాలిబన్లుగా అభివర్ణిస్తూ వెకిలి మాటలు మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యాఖ్యానించారు. మిలియన్ మార్చ్‌కు ఆంక్షలు విధించడం వల్లనే విగ్రహాల విధ్వంసం జరిగిందని ఆయన సోమవారం నల్లగొండలో అన్నారు. మిలియన్ మార్చ్ సందర్భంగా నాయకులను అరెస్టు చేయడం వల్ల నాయకత్వ నిర్దేశం చేసేవారు లేకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారని, దానివల్లనే విగ్రహాల విధ్వంసం జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తమిళనాడులో మాదిరిగా అన్ని సామాజిక అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీకి విలీనం పిచ్చి పట్టుకుందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసు పార్టీని ప్రజలే బంగాళాఖాతంలో కలిపేస్తారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ఐక్యంగా ఉండాలని, ఐకమత్యంతోనే తెలంగాణ సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హైదరాబాదులో మూతపడిన 400 కల్లు దుకాణాలను తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కల్లుగీత కార్మికులను దెబ్బ తీస్తూ ప్రభుత్వం హైదరాబాదు కల్లు దుకాణాలను మూసేసిందని ఆయన విమర్శించింది. కాంగ్రెసులో తెరాస విలీనం జరిగే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.

English summary
TRS president K Chandrasekhar Rao lashed out at Seemandhra political leaders for making comments against Telanganites. He clarified that TRS will not merge into Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X