హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ భయం: కాంగ్రెసు ఎమ్మెల్యేలకు విప్ జారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్‌: శాసనసభ్యుల కోటాలో శాసన మండలికి జరిగే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ భయం పట్టుకున్నట్లే ఉంది. శాసనసభ్యులు క్రాస్ వోటింగ్‌కు పాల్పడుతారనే భయంతో ముందస్తు చర్యలకు కాంగ్రెసు పార్టీ నాయకత్వం దిగింది. శాసనసభ్యులకు విప్ జారీ చేసినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ మల్లుభట్టి విక్రమార్క సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఈ నెల 16, 17 తేదీల్లో శాసనసభ్యులు శాసనసభలో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. విప్ ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ నెల 17వ తేదీ పది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుగుతున్నాయి.

పది స్థానాలకు 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెసు ఏడు స్థానాలకు, మిత్రపక్షం సిపిఐతో కలిసి తెలుగుదేశం నాలుగు స్థానాలకు, తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్క సీటుకు పోటీ చేస్తున్నాయి. ఏడో స్థానాన్ని గెలుచుకోవడానికి కాంగ్రెసుకు, నాలుగో స్థానాన్ని గెలుచుకోవడానికి తెలుగుదేశం పార్టీకి సంఖ్యాబలం లేదు. అలాగే, తెరాసకు ఒక్క అభ్యర్థిని గెలుచుకోవడానికి శాసనసభ్యుల సంఖ్య సరిపోదు.

ఈ స్థితిలో వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు క్రాస్ వోటింగ్‌కు పాల్పడుతారేమోనని కాంగ్రెసు నాయకత్వం భయపడుతోంది. అయితే, తమకున్న సంఖ్యాబలాన్ని బట్టే అభ్యర్థులను దించామని, తమ శాసనసభ్యులు క్రాస్ వోటింగ్‌కు పాల్పడబోరని మల్లుభట్టి విక్రమార్క అంటున్నారు. అయితే, క్రాస్ వోటింగ్ భయం వల్లనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీక్రెట్ కోడ్ విధానాన్ని అవలంబిస్తున్నారు.

English summary
It is learnt that Congress leadership is fearing of cross voting by the YS Jagan camp MLAs in MLC election to be held in MLAs quota. Chief Whip Mallubhatti Vikramraka issued whip to his party MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X