వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత సంతతి మోడల్ పట్ల ఆస్ట్రేలియాలో జాతి వివక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

Kema Rajandran
సిడ్నీ‌: అస్ట్రేలియాలో తాజాగా మరో జాతి వివక్ష సంఘటన చోటు చేసుకుంది. భారత సంతతి మోడల్ ఆరోపణలతో ఈ కొత్త వివాదం ప్రారంభమైంది. పెర్త్‌లో నాన్ కాకేసియన్ హెరిటేజ్‌కు చెందినవారు నిలదొక్కుకోవడం కష్టమని జాతీయ మోడలింగ్ ఏజెన్సీ కేమా రాజేంద్రన్‌తో చెప్పినట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ రాసింది. రాజేంద్రన్ సోమవారంనాడు తన ఫొటోలను చాడ్విక్ మోడల్ ఏజెన్సీకి పంపింది. దానికి జవాబుగా వచ్చిన ఇ - మెయిల్ చూసి రాజేంద్రన్ దిగ్భ్రాంతికి గురైనట్లు ఆ పత్రిక రాసింది.

మీది ఫొటోజెనిక్ ఫేస్ అంటూనే తమ కాస్టింగ్ డివిజన్‌కు సరిపోతుందని ఆ సంస్థ రాజేంద్రన్‌కు తెలిపింది. అయితే, నాన్ కాకేసియన్ హెరిటేజ్‌కు చెందిన మీకు పెర్త్‌లో అవకాశాలు పరిమితంగా ఉంటాయనేది గుర్తించాలని కూడా ఆ సంస్థ వ్యాఖ్యానించింది. మైనారిటీల పట్ల వివక్షను అడ్డుకోవడానికి తనకు జరిగిన అవమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని రాజేంద్రన్ అన్నారు. ఆమె ఇంతకు ముందు యునైటెడ్ కింగ్‌డమ్‌లో మోడల్‌గా పనిచేశారు.

తమ ప్రతిస్పందనను తప్పుగా అన్వయించారని మోడలింగ్ ఏజెన్సీ చెబుతోంది. తమ వ్యాఖ్యలు జాతి వివక్షకు సంబంధించినవి కావని, అలా అనుకోవడం అపహాస్యమని ఏజెన్సీకి చెందిన తాన్యా ముయియా అన్నారు. పెర్త్‌లో ఆమెకు మార్కెట్ ఉండదని చెప్పే స్వేచ్ఛ తమకు ఉందని, తాము నిజాయితీగా ఆ విషయం చెప్పామని అన్నారు.

English summary
A new controversy over racism in Australia has stemmed from the allegations made by a model of Indian origin. The Sydney Morning Herald reports that Kema Rajandran was told by a national modelling agency that her "non-Caucasian heritage" would make it difficult for her to land work in Perth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X