వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు నెలల్లో 33 మంది స్త్రీలతో సెక్సులో పాల్గొన్న ప్రధాని..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Silvio Berlusconi
రోమ్: ఇటలీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ తనపై వస్తున్న సెక్స్ స్కామ్‌ ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. ఓ ప్రతిపక్ష వార్తా పత్రికతో మాట్లాడుతూ.. తనది సెక్స్‌లో పాల్గొనే వయస్సుకు కాదని, తాను చాలా ముసలివాడినని, ఇటాలియన్ ప్రాసిక్యూటర్లు తనను అనవసరంగా ఇందులోకి లాగుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం 'రూబీ' ది హార్ట్ స్టీలర్‌ (హృదయాన్ని దోచుకునేది)గా పిలిచే 17 ఏళ్ల మైనర్ బాలికతో బెర్లుస్కోనీ సెక్స్‌ జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. కాగా.. ఈ కేసులో ప్రాసిక్యూటర్లు గుర్తించిన డాక్యుమెంట్ల ప్రకారం.. బెర్లుస్కోనీ రెండు నెలల్లో రూబీతో పాటు 33 మంది స్త్రీలతో వ్యభిచారం చేసినట్లుగా ఉంది.

"నేను కొంచెం ఆకతాయినే కావచ్చు.. కానీ రెండు నెలల్లో 33 మంది అమ్మాయిలంటే.. 30 ఏళ్ల వయస్సు గల వారికి కూడా అసాధ్యమ"ని లా రిపబ్లికా పత్రికు ప్రధాని చెప్పారు. అయితే తనకు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉందని, ఎల్లప్పుడూ తనతోనే ఉంటుందని ఆయన చెప్పారు. అంతకు మించి వివరాలను బెర్లుస్కోనీ వెల్లడించలేదు. అమ్మాలతో సెక్స్ కోసం బ్యాంకు ట్రాన్స్‌ఫర్ల ద్వారా డబ్బును చేతులు మార్చినట్లుగా వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఇలాంటి పనులకు డబ్బును ఎవరైనా బ్యాంకు ద్వారా ట్రాన్స్‌ఫర్ చేస్తారా..? అని 74 ఏళ్ల బెర్లుస్కోనీ ప్రశ్నించారు.

English summary
Italy Premier Silvio Berlusconi told a newspaper that he is too old to have had all the sexual encounters he is accused of by Italian prosecutors. The PM faces trial in Milan over charges he paid for sex with a Moroccan minor, Ruby, and used his influence to try cover it up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X