వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అణు ప్రమాదం గురించి జపాన్‌కు ముందే తెలుసు: వికీలీక్స్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Wikileaks-Nuclear Threat
జపాన్‌కు అణు ప్రమాదం పొంచి ఉన్న సంగతి ముందుగానే ఆ దేశానికి తెలుసునని రహస్య పత్రాలను వెల్లడి చేసే వెబ్‌సైట్ వికీలీక్స్ పేర్కొంది. జపాన్‌లో అధిక తీవ్రత కలిగిన పెను భూకంపం సంభవిస్తే అక్కడ ఉన్న అణు విద్యుత్ కేంద్రాలకు ముప్పు వాటిళ్లే అవకాశం వుందని గతంలో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) జపాన్‌ను హెచ్చరించినట్లు వికీలీక్స్‌ను ఉటంకిస్తూ.. బ్రిటన్‌కు చెందిన డైలీ టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. రిక్టర్ స్కేల్‌ (భూకంపం తీవ్రతను కొలిచే కొలమానం)పై 7.0 మ్యాగ్నిట్యూడ్ తీవ్రత కలిగిన భూకంపాలను మాత్రమే తట్టుకోనేలా జపనీస్ రియాక్టర్లను డిజైన్ చేశారని ఒక ఐఏఈఏ నిపుణుడు డిసెంబర్ 2008లో తెలిపినట్లుగా ఉన్న అమెరికా దౌత్య కేబుల్‌ను వికీలీక్స్ బహిర్గతం చేసింది.

కాగా.. జపాన్ న్యూక్లియర్ ప్రమాదంపై అమెరికా తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తూ.. ఫుకుషిమా అటామిక్ ప్లాంటు డ్యామేజ్ కారణంగా వెలువడుతున్న రేడియేషన్ స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకుందని, దీనివల్ల ఆ ప్రాంతంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని అమెరికాకు చెందిన స్టేట్ ఫర్ మేనేజ్‌మెంట్ అండర్ సెక్రటరీ ప్యాట్రిక్ కెన్నెడీ తెలిపారు. ఇదిలా ఉండగా.. టోక్యోలో నివసిస్తున్న తమ దేశపు ప్రజలు జపాన్ వదిలిపెట్టి వచ్చేయాల్సిందిగా జర్మనీ పిలుపునిచ్చింది. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం నుంచి వెలువడుకన్న రేడియేషన్ తీవ్ర పెరుగుతన్న నేపథ్యంలో ఈ జర్మనీ ఆ ప్రాంతాని వదలిపెట్టాల్సిందిగా జర్మనీ ప్రభుత్వం తమ ప్రజలను కోరింది.

English summary
An IAEA expert expressed concern that the Japanese reactors were only designed to withstand magnitude 7.0 tremors, according to a December 2008 US diplomatic cable obtained by the WikiLeaks website, Britain's Daily Telegraph reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X