డప్పు కొట్టి నృత్యం చేసిన చంద్రబాబు, లంబాడీ మహిళలతో హోలీ

పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన హోలీ వేడుకల్లో బిజెపి సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ కూడా పాల్గొన్నారు. హోలీ సందర్భంగా తిరుమలకు విఐపిల తాకిడి పెరిగింది. టాలీవుడ్ హీరో నాగార్జున, బాలీవుడ్ అందాల భామ దీపికా పడుకొనే తదితర సినీ ప్రముఖులు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అత్యంత ఉత్సాహంతో హోలీ సంబరాలను జరుపుకుంటున్నారు.
రాజభవన్‌లో గవర్నర్ నరసింహన్ దంపతులు రంగుల్లో మునిగిపోయారు. రాజభవన్‌లో వారు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని తాను ఈ సందర్భంగా కోరుకుంటున్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ వేడుకల్లో కూడా దత్తాత్రేయ పాల్గొన్నారు.