• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మైనర్ బాలికతో 13 సార్లు సెక్స్ చేసిన ప్రధానమంత్రి

By Nageswara Rao
|

Silvio Berlusconi
మిలాన్: ఇటలీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీకు సెక్స్ స్కామ్ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇతని రాసలీలలు తవ్వినకొద్దీ బయటపడుతున్నాయి. బెర్లుస్కోనీ మిలాన్‌కు సమీపంలో ఉన్న తన నివాసంలో ఓ మైనర్ బాలికతో 13 సార్లు సెక్సులో పాల్గొన్నాడనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ప్రస్తుతం బెర్లుస్కోనీ అండర్-ఏజ్ మోరొకాన్ యువతికి డబ్బులు చెల్లించి ఆమెతో వ్యభిచారం జరిపిన కేసులో విచారణ ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రాసిక్యూటర్లు ఏడు పేజీల నిడివి గల డాక్యుమెంట్‌ను ఇటాలియన్ నేతపై కేసు ఫైల్ చేశారు. రూబీతో సహా మరో 33 మంది స్త్రీలతో ఆయన రతిక్రీడలు జరిపినట్లుగా ప్రాసిక్యూటర్లు తమ నివేదికలో పేర్కొన్నారు.

సెక్సు భాగస్వాములతో అశ్లీల పార్టీలు చేసుకోవడం, మైనర్ బాలికతో వ్యభిచారం చేయడం వంటి కేసులను ఆయనపై మోపారు. అయితే ఈ ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని, కేవలం తనను అన్‌పాపులర్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని బెర్లుస్కోనీ తోసిపుచ్చారు. డిన్నర్, డ్యాన్స్ చేయడానికి మాత్రమే రూబీ (క్లబ్ డ్యాన్సర్) తన ఇంటికి వచ్చిందని అంతకుమించి మరేంజరగలేదని ఆయన సమాధానమిచ్చారు. ఈ విషయంపై తనను తాను రక్షించుకోవడంతో పాటు ఆ అమ్మయిని కూడా రక్షించేందుకు టెలివిజన్ ఛానెళ్లో వివరణ ఇవ్వనున్నట్లు బెర్లుస్కోనీ చెప్పారు.

English summary
Italian Premier Silvio Berlusconi paid for sex with an under-age Moroccan teen 13 times at his villa near Milan, prosecutors have said in a document filed seeking indictments against three aides for allegedly soliciting prostitutes for the Italian leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X