కాల్పులే మా ప్రభుత్వాన్ని కూల్చాయి: టిడిపి ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: బషీర్ బాగ్ కాల్పుల ఘటననే తెలుగుదేశం పార్టీని అధికారంనుండి కూల్చి వేసిందని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి శుక్రవారం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాజధానిలోని బషీర్ బాగ్ వద్ద న్యాయం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై నాటి ప్రభుత్వం కాల్పులు జరిపించిందనే ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఆరుగురు రైతులు చనిపోయారు.
ఆ ఘటననే నాగం ఉదహరిస్తూ టిడిపి ప్రభుత్వం అధికారం కోల్పోవడానికి కారణం ఆ ఘటనే అని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలంటే చిన్న చూపు ఉండకూడదన్నారు. చిన్న చిన్న సంఘటనలే ప్రభుత్వాన్ని కూల్చేందుకు దారి తీస్తాయని హెచ్చరించారు.