కర్ర కాల్చి వాత పెడితే ప్రభుత్వానికి సిగ్గు వస్తుంది: నారాయణ
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: కర్రకాల్చి వాత పెడితేగానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గు వస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ శనివారం ధ్వజమెత్తారు. నారాయణ ఉదయం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద రాష్ట్రంలోని బిసి, ఎస్టీలకు న్యాయం చేయాలంటూ నిరాహార దీక్ష చేస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులును కలిసి తన సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు పార్టీలకు చిత్తశుద్ధి ఉందన్నారు.
రాఘవులు మూడో రోజు తన దీక్షను కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రజా సమస్యలపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుంటే ప్రభుత్వం పతనమౌతుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం గాఢనిద్రలో ఉందన్నారు. ప్రజా సమస్యలపై వెంటనే తేరుకోవాలని ఆయన హెచ్చరించారు.
CPI state secretary Narayana fired at Congress government today. He met CPM Raghavulu and supported to his fast. He demanded CM Kiran's government to solve public issues.
Story first published: Saturday, March 19, 2011, 12:52 [IST]