యూపిఏ ప్రభుత్వాన్ని గద్దె దించాలి: బిజెపి నేత వెంకయ్యనాయుడు

యుపిఏ-1 ప్రభుత్వం 2008 ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఎంపీలకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిందన్నారు. ఓటుకు నోటుపై పార్లమెంటులో పోరాడుతామని చెప్పారు. ఎంపీల కొనుగోలు అంశాన్ని ప్రజల వద్దకు తీసుకు వెళతామని చెప్పారు. ఓ కేంద్ర మంత్రి 14వ లోక్‌సభలో జరిగిన విషయాన్ని 15వ లోక్‌సభలో చర్చించకూడదని చెప్పడం విడ్డూరమన్నారు. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం గద్దె దిగాల్సిందే అన్నారు.
వికీలీక్స్ వ్యవహారం బయటపడిన తర్వాత కూడా యూపిఏ కొనసాగడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదన్నారు. అందరికీ తెలిసిన విషయాన్నే వికీలీక్స్ బయట పెట్టిందన్నారు. గత ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి 25 మంది ఎంపీలను కొనుగోలు చేసారని ఆరోపించారు.