హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దీక్ష విరమించబోనంటూ మొండికేస్తున్న సిపిఎం నేత రాఘవులు

By Pratap
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
హైదరాబాద్ : ప్రజాసమస్యలపై చేస్తున్న నిరవధిక దీక్షను విరమించబోనంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు మొండికేస్తున్నారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించే వరకు దీక్ష విరమించనంటూ ఆయన రాష్ట్ర మంత్రులు పి. శంకర రావుకు, డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు చెప్పారు. రాఘవులు సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో దీక్ష సాగిస్తున్నారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద దీక్ష చేస్తున్న ఆయనను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోనూ ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు.

రాఘవులు చేత దీక్ష విరమింపజేయడానికి మంత్రులు శంకర రావు, మాణిక్య వరప్రసాద్ ప్రభుత్వ రాయబారులుగా వచ్చారు. దీక్ష విరమించి చర్చలకు రావాలని వారు రాఘవులుకు సూచించారు. అయితే అందుకు ఆయన నిరాకరించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ నియామకం త్వరలో జరుగుతుందని, ఐటిడిఎ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.

English summary
CPM state secretary BV Raghavulu rejacted withdraw fast. He is continuing his fast in Gandhi hospital. Ministers P Shankar Rao and Dokka Manikya varaprasad met Rghavulu to appeal withdraw fast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X