హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రం వస్తే సమస్యలు తీరవు: దీక్ష విరమణ సమయంలో రాఘవులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
హైదరాబాద్: గత ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మంగళవారం తన దీక్షను విరమించారు. ఇందిరాపార్కు వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన తన దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు. మనం తలపెట్టిన కార్యక్రమం విజయవంతం అయిందన్నారు. అయితే కొన్ని డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర అనిశ్చితి నెలకొందన్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలా, ఒకటిగా ఉంచాలా అనే దానిపైనే చర్చలు జరుగుతున్నాయన్నారు. అది పరిష్కారం అయితే ప్రజల సమస్యలు తీరినట్టేనని భావిస్తున్నారు.

కాని అది సరికాదన్నారు. రాజకీయంగా ఎవరి ఎజెండా వారికి ఉందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడే వారు దానికోసం, సమైక్యాంధ్ర కోసం పోరాడే వారు అందుకోసం పోరాడుకోవచ్చునని చెప్పారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వారు కూడా చేయవచ్చునని సూచించారు. అంతకుముందు మంత్రులు పసుపులేటి బాలరాజు, పితాని సత్యనారాయణలను ప్రభుత్వం రాఘవులుతో చర్చకు పంపించింది. మంత్రుల చర్చలు ఫలించాయి. తాను దీక్షను విరమిస్తానని చెప్పారు. అయితే సాయంత్రం ఇందిరాపార్క్ వద్ద జరిగే భారీ బహిరంగసభలో దీక్షను విరమిస్తానని చెప్పారు. మహాత్మాగాంధీ హాస్పిటల్‌లో మంత్రులు చర్చలు జరిపారు.

ఎస్సీ, ఎస్టీల సంక్షేమం ప్రభుత్వానికి పట్టడం లేదని, వారి సంక్షేమంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ 50 డిమాండ్లు ఆయన ప్రభుత్వం ముందు ఉంచి గత ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన ఇందిరాపార్కు వద్ద ఆరు రోజుల క్రితం దీక్షను ప్రారంభించారు. అయితే ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గాంధీకి తరలించారు.

English summary
CPM state secretory Raghavulu withdrew his fast today. Ministers Pasupuleti Balaraju and pitani Satyanarayana talked with him about his demands. They promised him on some demands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X