వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సునామీ తర్వాత జపాన్ అణు రియాక్టర్ల నుంచి బూడిదరంగు పొగ

ఈ పేలుళ్లు సంభవించిన మరో రెండు రియాక్టర్లను చల్లబరించేందుకు సిబ్బంది హెలికాప్టర్లు, ట్యాంకర్ల ద్వారా వాటిలో టన్నుల కొద్దీ నీటిని నింపుతున్నారు. ఫుకుషిమా రియాక్టర్లను చల్లబరించేందుకు చైనా 62 మీటర్ల పొడవున్న పైపుతో కూడిన ట్యాంకర్‌ను మంగళవారం జపాన్‌కు పంపనుంది. అణు విపత్తును జపాన్ అధిగమిస్తుందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా.. జపాన్ భూకంపం, సునామీల్లో 8,600 మంది మృతిచెందారని, మరో 16 వేల మంది గల్లంతయ్యారని అధికారులు చెప్పారు.
దాదాపు 3.4 లక్షల మంది నిర్వాసితులయ్యారని పేర్కొన్నారు. సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలు సరైన ఆహారం, నీరు లేక అలమటిస్తున్నారు. విపత్తు సంభవించిన తూర్పు, ఈశాన్య తీరప్రాంతాల్లో త్వరలోనే పునర్మిర్మాణ పనులు చేపడతామని ప్రధాని నవాటో కాన్ హామీ ఇచ్చారు.