హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎల్ రాజీనామా చేయాలి, జగన్‌పై వేధింపులుంటే ఇలాగే: జగన్ వర్గం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకుంటే కాంగ్రెసు పార్టీయే నష్టపోతుందని ఆ పార్టీ అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం వ్యాఖ్యానించారు. జగన్‌ను దూరం చేసుకుంటే పార్టీకి నష్టం అని తాను ఇదివరకే చెప్పానని అన్నారు. ఇప్పటికైనా పార్టీకి కనువిప్పు కలిగి జగన్‌ను దగ్గరకు తీయాలని కోరారు.

జగన్‌పై వేధింపులు మానుకోవాలని సూచించారు. కాంగ్రెసు పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినా జగన్‌ను ఏమి చేయలేక పోయాయని అన్నారు.

కాగా కాంగ్రెసు ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కడప జిల్లా మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి రాజీనామా చేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సొంత జిల్లాలో అభ్యర్థిని గెలిపించుకోలేని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. కాంగ్రెసు అభ్యర్థులు ఓడిన చోట ఉన్న ఇంఛార్జులుగా ఉన్న మంత్రులు, జిల్లా మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

English summary
Ex MP YS Jaganmohan Reddy camp leaders Ambati Rambabu, Jupudi Prabhakar Rao demanded CM Kiran Kumar Reddy and DL Ravindra Reddy resignation. Congress MP Sabbam Hari suggest Party to don't avoid YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X