కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడపలో బాబాయ్ వివేకాకు షాక్: జగన్ వర్గం అభ్యర్థి విజయం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan-YS Vivekananda Reddy
కడప: కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ తన బాబాయ్ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డికి షాక్ ఇచ్చారు. జగన్ వర్గానికి చెందిన అభ్యర్థి నారాయణ రెడ్డి స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించారు. కేవలం నాలుగు ఓట్ల తేడాతో జగన్ వర్గం అభ్యర్థి బయటపడ్డారు. కాంగ్రెసు తరఫున పోటీ చేసిన వరదరాజులు రెడ్డి ఓడిపోయారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు అవగాహనకు వచ్చినప్పటికీ జగన్ వర్గం అభ్యర్థిని ఓడించలేకపోయారు.

జగన్ వర్గం అభ్యర్థి నారాయణ రెడ్డి ఓటమికి మంత్రులు వైయస్ వివేకానంద రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి, కన్నా లక్ష్మినారాయణ కడప జిల్లాలోనే మకాం వేసి వ్యూహరచన చేసి అమలు చేశారు. అయినా ఫలితం సాధించలేకపోయారు. కాగా, కాంగ్రెసు పార్టీ నాయకులు రీకౌంటింగ్‌కు డిమాండ్ చేస్తున్నారు. అందుకు జగన్ వర్గం నాయకులు వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు ఒక్కటై, ముగ్గురు మంత్రులు రంగంలోకి దిగడంతో జగన్ వర్గం అభ్యర్థి ఓడిపోతారని భావించారు. అయితే, అంచనాలను తలకిందులు చేస్తూ, స్పల్ప ఆధిక్యతతో జగన్ వర్గం అభ్యర్థి బయటపడ్డారు.

English summary
YSR Congress candidate Narayan Reddy won in Kadapa MLC constituency. YS Jagan camp succeeded in achieving upper hand on YS Vivekananda Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X