తమ హయాంలోని ప్రభుత్వంపై కూడా విచారణ చేయాలన్న చంద్రబాబు

కాగా మంత్రి రఘువీరారెడ్డి వారి వ్యాఖ్యలను ఖండించారు. భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే ఎవ్వరినీ వదిలేది లేదన్నారు. భూకేటాయింపులపై సభలో చర్చకు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ మాత్రం జెఎల్పీ కోసం తన పట్టు వీడలేదు. భూకేటాయింపులపై సంయుక్త సభా సంఘం ఏర్పాటు చేయాలని సభలో చర్చ వద్దని డిమాండ్ చేసింది. దాంతో ఈరోజు కూడా సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. మరోవైపు ఎంఐఎం సభ్యులు కూడా వక్ప్ భూముల కేటాయింపులపై సభా సంఘం వేయాలంటూ డిమాండ్ చేసింది.