వేటు వేయండి: జగన్ వర్గం ఎమ్మెల్యేలు, జెసిపై సిఎం ఫిర్యాదు
State
oi-Srinivas G
By Srinivas
|
న్యూఢిల్లీ:
మాజీ
పార్లమెంటు
సభ్యుడు
వైయస్
జగన్మోహన్
రెడ్డి
వర్గం
శాసనసభ్యులపై
ముఖ్యమంత్రి
కిరణ్
కుమార్
రెడ్డి
పార్టీ
అధిష్టానానికి
ఫిర్యాదు
చేశారు.
ఎమ్మెల్సీ
ఎన్నికలలో
పార్టీ
ఓటమిపై
వివరణ
ఇచ్చుకున్న
అనంతరం
కిరణ్
కుమార్
చిత్తూరు
జిల్లాలో
కాంగ్రెసు
అభ్యర్థిని
ఓడించిన
తన
ప్రత్యర్థి
పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డిపై,
అనంతపురంలో
పాటిల్
వేణుగోపాల్
రెడ్డి
ఓటమికి
కారణం
అయిన
మాజీ
మంత్రి
జేసి
దివాకర్
రెడ్డిపై
ముఖ్యమంత్రి
ఫిర్యాదు
చేసినట్లుగా
తెలుస్తోంది.
ఎమ్మెల్సీ
ఎన్నికలలో
పార్టీ
ఎమ్మెల్యేలే
పార్టీకి
వ్యతిరేకంగా
పని
చేయడంతో
కాంగ్రెసు
అభ్యర్థులు
ఓడిపోయారని
చెప్పారు.
పార్టీ
కార్యకలాపాలకు
వ్యతిరేకంగా
పని
చేసిన
మాజీ
పార్లమెంటు
సభ్యుడు
వైయస్
జగన్మోహన్
రెడ్డి
వర్గం
శాసనసభ్యులు,
జెసి
దివాకర్
రెడ్డిపై
చర్యలుతీసుకోవాలని
కోరారు.
వారిపై
చర్యలు
తీసుకోకుంటే
పార్టీకి
మరిన్ని
ఇబ్బందులు
ఎదురవుతాయని
చెప్పినట్లుగా
తెలుస్తోంది.
వారిపై
కఠినంగా
చర్యలు
తీసుకోవాల్సిందే
అని
చెప్పారు.
కాగా
గవర్నర్
కోటాలోని
ఎమ్మెల్సీ
అభ్యర్థులపై
కూడా
అధిష్టానంతో
చర్చించినట్లుగా
తెలుస్తోంది.
కాగా
ముఖ్యమంత్రి
అనుకున్న
సమయానికంటే
ఎక్కువసేపు
కేంద్రమంత్రి
గులాంనబీ
ఆజాద్‌తో
భేటీ
అయ్యారు.
ఆజాద్‌తో
సుమారు
40
నిమిషాలు
భేటీ
అయ్యారు.
రాష్ట్ర
పరిస్థితులపై
ఆజాద్‌కు
సంపూర్ణంగా
వివరించారు.
కాగా
ముఖ్యమంత్రి
కిరణ్
కుమార్
రెడ్డి
బేటీ
అహ్మద్
పటేల్‌తో
రద్దు
అయినట్లుగా
తెలుస్తోంది.
CM Kirankumar Reddy complaint to high command against Ex MP YS Jaganmohan Reddy camp MLAs today. He urged high command to take action Peddireddy Ramachandra Reddy and JC Diwakar Reddy.
Story first published: Thursday, March 24, 2011, 18:08 [IST]