వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ బొత్స: ముఖ్యమంత్రికి అధిష్టానం క్లాస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Kirankumar Reddy-Botsa Satyanarayana
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో రాష్ట్ర ఎన్నికల హీట్ తగలింది. స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో రహస్య పొత్తు పెట్టుకోవడంపై మంత్రి బొత్స సత్యనారాయణ అధిష్టానానికి గురువారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమికి కారణం రాజకీయ ప్రధాన ప్రత్యర్థి అయిన టిడిపితో రహస్య ఒప్పందం చేసుకోవడమే అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేశారని సమాచారం. ముఖ్యమంత్రి వైఖరి వల్లనే కాంగ్రెస్ ఓడిందంటూ బొత్స వివరించినట్లుగా తెలుస్తోంది.

అయితే అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి కంటే ముందే బొత్స సిఎం కిరణ్‌తో కలిశారు. తాను అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని బహిరంగంగానే చెప్పినట్టుగా తెలుస్తోంది. సిఎం వ్యవహార శైలిపై కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. టిడిపితో అవగాహనపై అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. టిడిపితో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో మరింత ఇబ్బందికర పరిస్థితులు తెచ్చారని సిఎంతో అన్నట్టుగా తెలుస్తోంది.

టిడిపితో పొత్తు వల్ల కాంగ్రెసు కార్యకర్తలు నైతికంగా దెబ్బతిన్నారనే బొత్స అధిష్టానానికి చెప్పారని తెలుస్తోంది. ఓటమిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఓటమికన్నా మ్యాచ్ ఫిక్సిందే బాధిస్తుందని అన్నట్టు సమాచారం. అయితే సిఎం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాతో 10 జన్‌పథ్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆస్కార్ ఫెర్నాండేజ్, అహ్మద్ పటేల్ పాల్గొన్నారు.

English summary
Minister Botsa Satyanarayana gave a complaint against CM Kirankumar Reddy to High Command today on TDP and Congress match fixing in mlc election. High Command is unhappy with CM attitude about match fixing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X