కెసిఆర్ సమావేశాలు జరుగుతుంటే బయట రాజకీయాలేంటి: దేవినేని
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్లమెంటు సభ్యుడు అయి ఉండి న్యూఢిల్లీలో సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ ఉండి బయట రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ చెప్పారు. టిడిపిని పీనుగల పార్టీ అనడం శోచనీయమన్నారు. పీనుగుల పార్టీ అయితే 2009 ఎన్నికలలో పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇంటిని ముట్టడిస్తామన్నారు. శ్రీకృష్ణ కమిటీలో ఉన్న 8వ అధ్యాయాన్ని కేంద్రం వెంటనే బహిర్గత పర్చాలని ఆయన డిమాండ్ చేశారు. భూకేటాయింపులపై ప్రభుత్వం జెఎల్పీ వేయడానికి వెనుకాడుతుందన్నారు. కాంగ్రెసు చేసిన పాపాలు బయటపడతాయనే వారు జెఎల్పీ వేయడం లేదని ఆరోపించారు.
TDP MLA Devineni Umamaheswara Rao said today that TRS president K Chandrasekhar Rao making politics outside of Parliament. He warned that seemandhra leaders will agitate at Sonia's residence if centre give Telangana.
Story first published: Thursday, March 24, 2011, 12:18 [IST]