నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసుతో విలీనంపై తెలంగాణ ప్రజలదే నిర్ణయం: కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కాంగ్రెసులో విలీనం చేసే విషయంపై తుది నిర్ణయం తనది కాదని, ఆ ప్రతిపాదన కాంగ్రెసు పార్టీ నుండి వస్తే ప్రజల నిర్ణయం మేరకు నడుచుకుంటానని టిఆర్ఎస్ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు బుధవారం బాన్సువాడలో జరిగిన బహిరంగ సభలో పేర్కొన్నారు. విలీనంపై తనతో ఎవరూ మాట్లాడలేదన్నారు. బుధవారం తెలుగుదేశం పార్టీ బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు విలీన ప్రతిపాదన రాలేదు కాబట్టి తెలంగాణ ఏర్పడ్డాక కూడా టీఆర్ఎస్ ఉంటుందని చెప్పారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర పునర్నిర్మాణంపై పార్టీ దృష్టి పెడుతుందన్నారు. కాంగ్రెసులో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తున్నట్లు జరుగుతున్నది విష ప్రచారమేననన్నారు. ఎంఎస్‌వోల సమావేశంలో తాను విలీనం మాట్లాడలేదన్నారు. కొందరు కుట్ర పూరితంగా విలీనం విష ప్రచారాన్ని చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

రెండు కళ్ల సిద్ధాంతం అంటూ చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారన్నారు. కొందరు దింపుడు కల్లం ఆశతో టిఆర్ఎస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. టిఆర్ఎస్ ఎదుగుదలను చూసి ఓర్వలేకే కుట్రతో కూడిన విలీన ప్రచారాన్ని ముందుకు తీసుకు వచ్చారన్నారు. బాబు ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణను అడ్డుకోలేరన్నారు. ఉప ఎన్నికలకు ముందు బాబు బాబ్లీ డ్రామా అడినప్పటికీ ఫలితం ఇవ్వలేదన్నారు. వందలాదిమంది జీవితాలను బలిపెట్టి నిర్మించుకున్న ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి మరక అంటించుకుందన్నారు. తెలంగాణను అడ్డుకునే కుట్రలో శ్రీకృష్ణ కూడా భాగస్వామి అయ్యారని ధ్వజమెత్తారు. 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయాలంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు.

తెలంగాణలో పుట్టిన సీమాంధ్రులంతా ఇక్కడివారే అన్నారు. అలాగే సీమాంధ్ర నుంచి వలసవచ్చి ఇక్కడ స్థిరపడినవారిని తమ సోదరుల్లాగే భావిస్తున్నామన్నారు. వారితో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తెలంగాణ పక్కా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కీలక దశలో ఉందని అన్నారు. తెలంగాణ ఏర్పడితే చేయబోయే కార్యక్రమాలను కూడా కెసిఆర్ ప్రస్తుతించారు. కాగా టిఆర్ఎస్‌లో చేరిన పోచారంను కూడా పొగడ్తలతో ముంచెత్తారు.

English summary
TRS president K Chandrasekhar Rao said yesterday that TRS merger with Congress is depend upon Telangana people. He said these words in Bansuwada public meeting. Bansuwada TDP rebel MLA Pocharam Srinivas Reddy joined in TRS. He said if people will asked for merger he is ready.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X