రాజీనామాపై జగన్ పార్టీలో చేరినప్పుడు ఆలోచిస్తాం: శ్రీకాంత్ రెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డినిగానీ, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డినిగానీ ఎవరు వ్యతిరేకించినా ఊరుకునేది లేదని గురువారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ జగన్ వర్గం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. మేమంతా వైయస్ అభిమానులమని చెప్పారు. వైయస్ హయాంలోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు. మేం కాంగ్రెసు పార్టీలోనే ఉన్నామన్నారు.
వైయస్‌ను విమర్శించిన వారికి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిస్తామన్నారు. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో మేం జానీకి ఓటు వేయలేదని చెప్పామా అని ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు. జగన్ పార్టీలో చేరే అవకాశం వచ్చినప్పుడు రాజీనామాలపై ఆలోచిస్తామని చెప్పారు. జగన్‌ను జైలుకు పంపుతామని కొందరు అంటున్నారని, అయితే కొన్నాళ్లు ఆగితే ఆయననే ప్రజలు ప్రజా జైలుకు పంపుతారని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని ఉద్దేశించి అన్నారు.
Ex MP YS Jaganmohan Reddy camp Congress MLA Srikanth Reddy said today that they are not thinking about resignations now. He warned Minister DL Ravindra Reddy for comments on YS Jagan.
Story first published: Thursday, March 24, 2011, 14:36 [IST]