శ్రీకృష్ణ కమిటీని ప్రాసిక్యూట్ చేయాలి: నాగం జనార్ధన్ రెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తెలంగాణపై 8వ అధ్యాయం పేరుతో కేంద్రానికి రహస్యంగా ఇచ్చిన శ్రీకృష్ణ కమిటీ సభ్యులను ప్రాసిక్యూట్ చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి గురువారం డిమాండ్ చేశారు. భారత స్వతంత్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ విషయంపైన అయినా సీక్రెట్ నివేదిక ఇచ్చిందా అని ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకే కాదని దేశానికే ద్రోహం చేస్తుందన్నారు. ఓ ప్రాంతంలోని ప్రజల మనోభావాలను అవమానపరిచేలా ఉన్నాయన్నారు. హైదరాబాదులో మతవిద్వేషాలు ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. హైదరాబాదులో మత సామరస్యానికి పాల్పడ్డ వారు చాలామంది ఉన్నారన్నారు. హైకోర్టు సూచనలను అనుసరించి శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
కమిటీకి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా ఎవరైనా నివేదిక ఇస్తే వారిపై చర్యలకు డిమాండ్ చేస్తామన్నారు. మా నీళ్లు మాకు, మా భూములు మాకు లేకుంటే మాట్లాడాని కమిటీ అబద్దపు రిపోర్టు ఇవ్వడం శోచనీయమన్నారు. తెలంగాణ కోసం వందలాది మంది చనిపోతే మాట్లాడని శ్రీకృష్ణ కమిటీ ఇలాంటి సీక్రెట్ రిపోర్టు ఇవ్వడం ఏమిటన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఓ సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చారని అదే ఈ రిపోర్ట్ అయి ఉంటుందని నాగం అనుమానం వ్యక్తం చేశారు. తాను సీక్రెట్ నివేదిక ఇచ్చినట్టు లగడపాటి అప్పుడే చెప్పారన్నారు.
తప్పుడు నివేదిక ఇచ్చిన శ్రీకృష్ణ కమిటీ సభ్యులను ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. 8వ అధ్యాయంలో ఏముందో, దానికి బాధ్యులు ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. దీనిపై అన్ని పార్టీలం కలిసి పోరాడుతామని చెప్పారు. ఉద్యమం ఎవరి చేతుల్లో లేదన్నారు. పార్టీల చేతులో లేదన్నారు. ఉద్యమం ప్రజల చేతిలో ఉందన్నారు. అది కమిటీ గుర్తించలేదన్నారు. 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మీడియా బాధ్యాతయుతంగా వ్యవహరించాలని కోరారు.