సిఎంగా కిరణ్‌ను దించేందుకు ఏం చేయాలో చేస్తా: పెద్దిరెడ్డి

తిప్పారెడ్డిని గెలిపించడానికి జిల్లాలోనే కాంగ్రెసు ఎమ్మెల్యేలు సహకరించారని అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫోటోకు చెప్పుల దండ వేసి, పిసిసి చీఫ్ డి శ్రీనివాస్ దిష్టిబొమ్మను తగుల బెట్టిన వ్యక్తి కాంగ్రెసు అభ్యర్థి ఎలా అవుతారని ప్రశ్నించారు. తిప్పారెడ్డి కొన్నేళ్లుగా కాంగ్రెసు బలోపేతానికి కృషి చేస్తున్నారు. చిత్తూరు ఎమ్మెల్సీ ఎన్నికలలో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతల అభ్యర్థులు ఓడిపోయారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ ఢిల్లీనుండి తిరిగి చిత్తూరు ఫలితాలపై స్పందించిన తర్వాతే నేను స్పందిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications