వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
8వ అధ్యాయంపై విచారణ చేపట్టాలి: ఎంపీ పొన్నం ప్రభాకర్

తెలంగాణ వస్తే నక్సలిజం అనేదే ఉండదన్నారు. తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు. కమిటీ రహస్య నివేదిక చూసిన తర్వాత కమిటీపై ఉన్న గౌరవం కూడా పోయిందన్నారు. మీడియా గౌరవాన్ని కూడా అగౌరవపరిచారని ఆరోపించారు. కమిటీ తన నివేదికలో, రహస్య నివేదికలో కొన్ని అపోహలకు మాత్రమే తెరతీసిందన్నారు. ఇది దురదృష్టకరమన్నారు. శ్రీకృష్ణ రిపోర్టు తప్పుల తడక అన్నారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నివేదిక ఉందన్నారు. రిపోర్టుపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.