శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంపై టి-కాంగ్రెస్ ఎంపీల ఫైర్
State
oi-Srinivas G
By Srinivas
|
న్యూఢిల్లీ: శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంలో తెలంగాణకు వ్యతిరేకంగా అంశాలను పొందు పర్చారని గురువారం న్యూఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ ఆరోపించారు. తెలంగాణలోని వాస్తవాలకు విరుద్దంగా నివేదికలో అంశాలు పొందుపర్చారని ఆరోపించారు. తెలంగాణ రాకుండా అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలతో కలిసి శ్రీకృష్ణ కమిటీ సభ్యులు చేసిన కుట్రనే నివేదికలోని 8వ అధ్యాయం అన్నారు.
తెలంగాణ ప్రజలను, విద్యాసంస్థలను, మీడియాను కించపర్చేలా ఉన్న ఆ నివేదిక తప్పులతడక అన్నారు. దేశంలో తీవ్రవాదుల దాడి జరగంది ఎక్కడో చెప్పాలని ప్రశ్నించారు. ఎంపీలను మేనేజ్ చేయడానికి మేం బర్రెలమో, గొర్రెలమో కాదని అన్నారు. విలేకరులతో మాట్లాడిన వారిలో ఎంపీలు పొన్నం ప్రభాకర్, మంద జగన్నాధం, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.