శనివారం ఓ గంటపాటు చీకటిలో మగ్గనున్న తాజ్‌హోటల్స్

సంస్థ కార్పొరేట్ డైరెక్టర్ వసంత్ అయ్యప్పన్ మాట్లాడు తూ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ 108 సంస్థల లో గంటపాటు విద్యుత్‌ను నిలిపివేయాలని నిర్ణయించిం దని వివరించారు.ఈ సంవత్సరం ఎర్త్ అవర్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఒక గంట పాటు తమ సంస్థల న్నీ చీకటిలో గడపనున్నాయని, ఆ రోజు హోటల్స్ పరిధి లో ఉన్న అన్ని లైట్లను ఆర్పివేయనున్నమని, లాబీ, రెస్టా రెంట్లు, స్టాప్ ఉండే ఏరియాల్లో విద్యుత్ సరఫరాను నిలి పివేస్తామని ఆయన వివరించారు.
ఈ గంటపాటు క్యాం డిల్స్ మాత్రమే వినియోగిస్తామని, రెస్టారెంట్లు, కార్యల యా ప్రాంతాలలోనూ క్యాండిల్స్‌నే వినియోగిస్తామని అంతేకాక హోటల్స్‌ను సందర్శించే అతిధిలకు కూడా ఇందోలో పాల్గొనమని ప్రోత్సహిస్తామని ఆయన వెల్లడిం చారు. అంతేకాక కేవలం ఈ గంటపాటు హోటల్స్‌తో పాటు స్టాఫ్ కూడా తమ ఇళ్లలో కూడా విద్యుత్ బల్బులు ఆర్పివేయాలని చూసిస్తామని ఆయన వివరించారు.