వైయస్ జగన్‌పై ముఖ్యమంత్రి పేషీలో కుట్ర: అంబటి రాంబాబు
State
oi-Pratapreddy
By Pratap
|
గుంటూరు: తమ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కార్యాలయంలోనే వ్యూహరచన జరిగిందని అంబటి రాంబాబు ఆరోపించారు. స్థానిక సంస్థల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జగన్‌కు వ్యతిరేకంగా కుమ్మక్కయ్యారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ వ్యూహరచనకు ముఖ్యమంత్రి కార్యాలయంలోని రమేష్ మధ్యవర్తిత్వం నెరిపాడని ఆయన అన్నారు.
అనంతపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కాంగ్రెసు సహకరిస్తే, కడప జిల్లాలో కాంగ్రెసుకు తెలుగుదేశం పార్టీ సహకరించడానికి ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని, కడపలో వైయస్ జగన్ వర్గం అభ్యర్థిని ఓడించడానికి ఈ రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్‌కు మైదుకూరు శాసనసభా నియోజకవర్గంలో మెజారిటీ వస్తే మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామా చేస్తారా అని ఆయన అడిగారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, కన్నా లక్ష్మినారాయణలను ఆయన విషపు పురుగులుగా అభివర్ణించారు.
YSR Congress party leader Ambati Rambabu alleged that CM Kiran Kumar Reddy and TDP president N Chandrababu hatched conspiracy against his leader YS Jagan. Both leaders tried to defeat YS Jagan camp candidate in Kadapa.
Story first published: Friday, March 25, 2011, 18:09 [IST]