చెన్నై: డిఎంకె అధినేత కరుణానిధి తన భార్యలిద్దరికీ సమానంగా ఆస్తి పంచినట్లు కనిపిస్తున్నారు. తనకు, తన ఇద్దరు భార్యలకు సంబంధించిన ఆస్తుల విలువను ఆయన ఆయన గురువారం వెల్లడించారు. గురువారం తిరువురూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన కరుణానిధి తమకు 41 కోట్ల విలువ చేసే అస్తులున్నట్లు వెల్లడించారు. కరుణానిధి భార్యలు దయాళు, రజతిలకు 36 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి ఉండగా, ఆయనకు 4.92 కోట్ల విలువ చేసే అస్తులున్నాయి.
కరుణానిధి భార్యల్లో దయాళు ఆస్తి విలువ 17.34 కోట్ల రూపాయలు కాగా, రజిత ఆస్తుల విలువ 18.68 కోట్ల రూపాయలు. దయాళు నలుగురు సంతానాల్లో కేంద్ర మంత్రి ఎంకె అళగిరి, ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారు. రజతి కూతురు కనిమొళి. కరుణానిధి మొదటి భార్య పద్మావతికి ఎంకె ముత్తు అనే కుమారుడున్నాడు. పద్మావతి మరణంతో కరుణానిధి 1948లో దయాళును పెళ్లి చేసుకున్నారు. కరుణానిధి ఇద్దరు భార్యలకు, ఆయనకు కూడా వ్యవసాయ భూములు లేవు. కరుణానిధికి ఆభరణాలు, కారు. ఇల్లు లేదు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
Tamil Nadu chief minister M Karunanidhi disclosed assets worth Rs 41 crore, collectively between him and his two wives, while filing his nomination papers for the Tiruvarur assembly constituency on Thursday.
Story first published: Friday, March 25, 2011, 8:36 [IST]