లగడపాటితో సహా 4ఎంపీలకు తప్పిన ముప్పు: కింగ్‌ఫిషర్ విమానంలో లోపం
State
oi-Srinivas G
By Srinivas
|
న్యూఢిల్లీ: మన రాష్ట్రానికి చెందిన నలుగురు పార్లమెంటు సభ్యులకు శుక్రవారం తృటిలో ప్రాణాపాయం తప్పింది. కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో సమావేశం అనంతరం నలుగురు ఎంపీలు తిరిగి హైదరాబాదుకు బయలు దేరారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సికింద్రాబాదు ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అందులో ఉన్నారు. వీరితో పాటు గజల్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. సమావేశం అనంతరం వీరు న్యూఢిల్లీ నుండి బయలు దేరిన కింగ్‌ఫిషర్ విమానంలో హైదరాబాదు బయలు దేరారు.
అయితే బోపాల్ ప్రాంతానికి వచ్చిన తర్వాత అద్దంలో పగుళ్లు గుర్తించారు. దీనిని గుర్తించిన పైలట్ వెంటనే తిరిగి న్యూఢిల్లీకి తీసుకు వెళ్లారు. విమానం ఢిల్లీనుండి బయలు దేరిన 30 నిమిషాలకు పైలట్ అద్దంలో పగుళ్లను గుర్తించి తిరిగి సేఫ్‌గా ఎంపీలతో కూడిన విమానాన్ని ఢిల్లీ తీసుకు వెళ్లారు. కాగా అధికారులు ఆ నలుగురు ఎంపీలను మరో విమానంలో హైదరాబాదుకు పంపించారు.
King Fisher flight accident averted just with technical problem today in Delhi. In this flight four AP MPs were coming to Hyderabad. MPs Lagadapati, Rayapati, Asaduddin, Anjan were in flight. Airport officers sent them in another flight.
Story first published: Friday, March 25, 2011, 17:27 [IST]