హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపులపై సభా సంఘం వేయాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేస్తున్న డిమాండుకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. సభా సంఘం వేయడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే, ఓ మెలిక పెట్టింది. శాసనసభలో జరిగే చర్చలో ప్రాథమిక సాక్ష్యాధారాలు బయటపడితేనే సభా సంఘం వేస్తామని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె. గీతా రెడ్డి చెప్పారు. సాక్ష్యాధారాలు ఉన్నాయా, లేవా అనేది చర్చలో తేలాల్సి ఉందని, అదే విధంగా సభా సంఘం విచారణలో ఏయే అంశాలు చేర్చాలనేది కూడా తేలాల్సి ఉందని ఆమె చెప్పారు.
కాగా, భూకేటాయింపులపై గత వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ సభ్యులు శాసనసభ కార్యక్రమాలను స్తంభింపజేస్తున్నారు. ఈ విషయంలో అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు పట్టువిడుపుల ధోరణి ప్రదర్శించాలని లోకసత్తా సభ్యుడు జయప్రకాష్ నారాయణ, సిపిఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. చర్చ లేకుండానే సభాం సంఘం వేయాలి తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
CM Kiran Kumar Reddy's government expressed its willingness to constitute Hose committee on land allocations. Geetha Reddy said that after debate only government will take decision house committee.
Story first published: Friday, March 25, 2011, 15:31 [IST]