వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంచినీటిని దిగుమతి చేసుకుంటున్న జపాన్‌

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Japan Tsunami
టోక్యో: నీటి శుద్ధి కేంద్రాల్లోని నీరు శిశువులకు సురక్షితం కాదని తాజా పరీక్షల్లో వెల్లడవుతుండటంతో నీటి సీసాల్ని దిగుమతి చేసుకునే ప్రక్రియను జపాన్‌ ప్రభుత్వం ముమ్మరం చేసింది. టోక్యో వాసులు నీటి సీసాల కొనుగోలుకు ఎగబడుతున్నారు. సునామీ ధాటికి దెబ్బతిన్న ఫుకుషిమా అణుకేంద్రంలో ముగ్గురు కార్మికులు రేడియో ధార్మికత ప్రభావానికి లోనయ్యారు. గురువారం మూడో రియాక్టర్‌ వద్ద కేబుల్‌ను పునరుద్ధరించే పనిలో ఉండగా తీవ్రస్థాయి రేడియేషన్‌ బారిన పడ్డారు. ముగ్గురిలో ఇద్దరి కాళ్లకి తీవ్ర గాయాలవ్వడంతో ఆస్పత్రిలో చేర్చారు.

170-180 మిలీసీవెర్ట్‌ స్థాయి రేడియేషన్‌కు గురైనట్లు అణు, పారిశ్రామిక భద్రత సంస్థ వెల్లడించింది. కార్మికుల ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన స్థాయులకన్నా తక్కువ స్థాయిలోనే రేడియో ధార్మిక ప్రభావానికి గురయ్యారని పేర్కొంది. రష్యా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు జపాన్‌ నుంచి ఆహార దిగుమతుల్ని నిలిపి వేశాయి. భూకంపం అనంతర ప్రకంపనలు ఇప్పటికీ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. జపాన్‌ ప్రజల సహాయార్థం దుప్పట్లు పంపినందుకు ప్రధాని నవోటో కన్‌ భారత్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. భారత ప్రధాని మన్మోహన్‌ జపాన్‌ ప్రధానితో ఫోన్‌లో మాట్లాడి, మరింత సాయం అందించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు.

English summary
The Japanese authorities are considering a plan to import bottled water from overseas, a government official said Thursday morning, a day after spreading contamination from a crippled nuclear plant led to a panicked rush to buy water in Tokyo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X