వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓటమిపై అధిష్టానానికి జెసి వివరణ, రఘువీరాపై ఫిర్యాదు

ఇటీవల జరిగిన స్థానిక శాసనమండలి ఎన్నికలలో అనంతపురం జిల్లాలో జెసి దివాకర్ రెడ్డి వర్గం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనంతలో ఓటమికి జెసి దివాకర్ రెడ్డి కారణం అంటూ గురువారం అధిష్టానం వద్ద ఫిర్యాదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు తీసుకోకుంటే కాంగ్రెసుకే నష్టం అని చెప్పారు. ఈ నేపథ్యంలో జెసి దివాకర్ రెడ్డి అనంతపురంలో కాంగ్రెసు ఓటమికి కారణాలు, తనపై ముఖ్యమంత్రి కిరణ్ చేసిన ఫిర్యాదుకు వివరణ ఇచ్చారు.